ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ధరించే హ్యాండ్ బ్యాగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నిన్న పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ ను వేసుకొచ్చిన ప్రియాంక.. తాజాగా ఇవాళ బంగ్లాదేశ్ అనే పేరుతో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను తీసుకుని సభకు వచ్చారు.
కాగా పాలస్తీనాలో దాడులపై మాట్లాడిన ఆమె.. నిన్న బంగ్లాదేశ్ అంశంపై లోక్ సభలో మాట్లాడారు. బంగ్లాదేశ్ లో మైనారిటీల భద్రత కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణ తర్వాత బంగ్లాదేశ్ లో మైనారీటీలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ఆమె బ్యాగ్ పై బంగ్లాదేశ్ హిందువులు, క్రైస్తవులతో నిలబడండి అని రాశారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ ధరిస్తున్న హ్యాండ్ బ్యాగ్ లపై కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా చర్చించుకుంటున్నారు.
ALSO READ | JPCకి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు.. జేపీసీ కాల పరిమితి ఏంటీ.. ఏయే అంశాలు చర్చిస్తారు..?