బుల్డోజర్‌‌‌‌ న్యాయం కరెక్ట్​ కాదు: ప్రియాంక

బుల్డోజర్‌‌‌‌ న్యాయం కరెక్ట్​ కాదు: ప్రియాంక

న్యూఢిల్లీ: బుల్డోజర్‌‌‌‌ న్యాయం కరెక్ట్​ కాదని, దాన్ని వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఛతర్‌‌‌‌పూర్ జిల్లాలో నిరసన సందర్భంగా హింసకు పాల్పడిన ఓ వ్యక్తి ఇంటిని కూల్చివేసిన ఘటనపై ఆమె శనివారం స్పందించారు. "ఎవరైనా నేరానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన వెంటనే నిందితుడి కుటుంబాన్ని ఇంటిని కూల్చివేయడం న్యాయం కాదు.

అతడి నేరాన్ని, దానికి సంబంధించిన శిక్షను కోర్టులు మాత్రమే నిర్ణయిస్తాయి” అని ఆమె పేర్కొన్నారు. చట్టాన్ని రూపొందించేవారికి, చట్టాన్ని కాపాడేవారికి, చట్టాన్ని ఉల్లంఘించేవారికి మధ్య వ్యత్యాసం ఉండాలని, ప్రభుత్వాలు నేరస్థుల్లా ప్రవర్తించకూడదని ఆమె నొక్కిచెప్పారు. రాజధర్మాన్ని నెరవేర్చలేని వారు సమాజ శ్రేయస్సు, దేశ సంక్షేమం కోసం పనిచేయలేరని అన్నారు.