రాహుల్‌ గాంధీకి ప్రియాంక ఎమోషనల్ లెటర్

రాహుల్‌ గాంధీకి  ప్రియాంక ఎమోషనల్ లెటర్

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి ఆయన చెల్లి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం లేఖ రాశారు. లోక్ సభ ఎన్నికలు 2024లో వయనాడ్, రాయ్ బరేలీలో రెండు చోట్లా పోటీ చేసిన రాహుల్ గాంధీ ఆ సీట్లలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతేకాదు ఎన్డీయేకు కూటమి గట్టి పోటీని కూడా ఇచ్చింది. కాంగ్రెస్ 99 స్థానాలను గెలిచింది. రాహుల్ గాంధీ గట్టిగా ప్రయత్నించాడని ఆయన చెల్లి ప్రియాంక గాంధీ అన్నారు. దీంతో ప్రియాంక గాంధీ ఆయన్ని ప్రసంశిస్తూ లేఖ రాశారు.

ప్రత్యర్థులు అబద్దాలతో ప్రచారం చేసినప్పటికీ రాహుల్ ఏనాడు వెనుకడుగేయలేదు, సత్యం కోసం పోరాటం సాగించాడని అన్న రాహుల్ గాంధీపై లెటర్ లో ప్రసంశల వర్షం కురిపించింది. ధైర్ఘ్యాన్ని దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా రాహుల్ గాంధీ అలాగే నిలబడి ఉన్నాడని, అసమానతలను ఎన్నడు వెనక్కి తీసుకోలేదని ఆమె కొనియాడారు. రాహుల్ గాంధీ చాలా గొప్ప వ్యక్తిని అభివర్ణించారు.