వయనాడ్: సోదాల పేరుతో మహిళల గదుల్లోకి పోలీసులు వెళ్లడం తప్పు అని వయనాడ్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. కేరళ పోలీసులు పరిధి దాటి ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి, పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాలక్కాడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడి ఓ హోటల్లో ఉంటున్నారు.
అయితే ఇటీవల ఓ మహిళా కార్యకర్త బ్యాగ్‌తో లోపలికి ప్రవేశించడంతో పోలీసులు సోదాలు చేశారు. దీంతో అర్ధరాత్రి మగ పోలీసులు సోదాలు చేయడంపై కాంగ్రెస్‌నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ఫిర్యాదు చేసింది. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ కూడా స్పందించింది. హోటల్ నుంచి డబ్బు తరలించేందుకు కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నదని ఆరోపించింది.