‘ప్రజలపై అణచివేతే’.. యూపీ సోషల్ మీడియా పాలసీపై ప్రియాంక గాంధీ ఫైర్

‘ప్రజలపై అణచివేతే’.. యూపీ సోషల్ మీడియా పాలసీపై ప్రియాంక గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సోషల్ మీడియా పాలసీని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. ‘‘న్యాయం కోసం కొట్లాడుతున్న మహిళల గొంతులు.. కొత్త పాలసీలో ఏ కేటగిరీ కిందికి వస్తాయి..? 69వేల టీచర్ రిక్రూట్మెంట్ రిజర్వేషన్ స్కామ్‎లో లేవనెత్తిన ప్రశ్నలు ఏ కేటగిరీ కిందికి వస్తాయి?” అని అడిగారు. ఈమేరకు గురువారం ప్రియాంక గాంధీ ‘ఎక్స్’ లో పోస్టు పెట్టారు. యూపీ సర్కార్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి బదులు, వాళ్లను మరింత అణచివేస్తున్నదని మండిపడ్డారు.