Priyanka Gandhi: భారీ ఆధిక్యంలో ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: భారీ ఆధిక్యంలో ప్రియాంక గాంధీ

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, యూపీ, కేరళ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి  ప్రియాంకాగాంధీ లీడ్ లో ఉన్నారు. సీపీఐ అభ్యర్థి సత్యన్  మోకేరి, బీజేపీ అభ్యర్థి నవ్యహరిదాస్ ల కంటే ముందంజలో ఉన్నారు.  ప్రస్తుతం 24వేల ఓట్లకుపైగా  ఆధిక్యంలో ఉన్నారు. 

ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దీంతో అందరి దృష్టి వయనాడ్ పార్లమెంటరీ స్థానం ఫలితాలపైనే ఉంది. పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీటు ను ఖాళీ చేయడంతో ప్రియాంకా పోటీలో ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా అని ఉత్కంఠగా ఎదురుచూ స్తు న్నారు. 

వయనాడ్ నియోజకవర్గంలో మొత్తం 9.52 లక్షలు ఓట్లు పోలయ్యాయి. దాదాపు ఆరులక్షల ఓట్లు ప్రియాంకగాంధీ సాధిస్తుందని అక్కడి కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నారు. అనుకున్నట్లుగానే వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీ లీడ్ లో ఉన్నారు. ఎల్ డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మొకేరికి రెండు లక్షలు, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ లకు లక్ష ఓట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. 

ప్రియాంగ గాంధీ  గెలుపుపై ధీమాగా ఉన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని చెబుతున్నారు.శనివారం (నవంబర్ 23) న ఉదయం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.  మహారాష్ట్రలో ఎన్డీయే హవా కొనసాగుతోంది. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీలో ఎన్డీయే ఆధిక్యంలో ఉంది.