జమిలి జేపీసీలో ప్రియాంక గాంధీ

జమిలి జేపీసీలో ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: వన్ నేషన్, వన్ ఎలక్షన్​కు సంబంధించిన రెండు బిల్లులపై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నామినీ లిస్ట్​లో కాంగ్రెస్‌‌ తరఫున ఎంపీ ప్రియాంక గాంధీ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆమెతో పాటు కాంగ్రెస్‌‌ తరఫున మనీశ్‌‌ తివారీ, రణ్‌‌దీప్‌‌ సూర్జేవాలా, సుఖ్‌‌దేవ్‌‌ భగత్‌‌ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

టీఎంసీ నుంచి కల్యాణ్ బెనర్జీ, డీఎంకే నుంచి పి.విల్సన్, బీజేపీ నుంచి రవి శంకర్ ప్రసాద్, అనురాగ్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, జేడీ(యూ) నుంచి సంజయ్ ఝా పేర్లను ఆయా పార్టీలు పరిశీలిస్తున్నాయి.