పాలస్తీనా బ్యాగ్తో ప్రియాంక గాంధీ.. అందుకే కాంగ్రెస్కు ఓటమి అన్న బీజేపీ

పాలస్తీనా బ్యాగ్తో ప్రియాంక గాంధీ.. అందుకే కాంగ్రెస్కు ఓటమి అన్న బీజేపీ

పాలస్తీనా బ్యాగ్తో ప్రియాంక గాంధీ.. అందుకే కాంగ్రెస్ కు ఓటమి ఓడిపోయారన్న బీజేపీ ఎంపీ
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంటు ఆవరణలో అందరి దృష్టిని  ఆకర్శించింది.  ‘పాలస్తీనా’ అని రాసి ఉన్న బ్యాగ్ వేసుకొని సోమవారం పార్లమెంటుకు వచ్చారు. పాలస్తీనాకు మద్ధతుగా, సంఘీభావంగా ఈ బ్యాగ్ వేసుకున్నారు. మొదటి నుండీ  గాజాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులపై.. అదేవిధంగా పాలస్తీనాకు మద్ధతుగా ఆమె తన గొంతు వినిపిస్తూ వస్తున్నారు. ప్రియాంక పార్లమెంటు ఆవరణలో బ్యాగ్ తో ఉన్న ఫోటోను కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ షమా మొహ్మద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.  
పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగుతో ప్రియాంక రావడంపై బీజేపీ నేత సంబిత్ పాత్ర విమ్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఒక వర్గాన్ని బుజ్జగించే పనిలో ఉందని, అందుకే ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వస్తున్నాయని మీడియా సమావేశంలో విమర్శించారు. 
అంతకు ముందు రోజు (ఆదివారం) పాలస్తీనా రాయబారి అబు జాజర్ తో ప్రియాంక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పాలస్తీనా స్కార్ఫ్ తో కనిపించారు. పాలస్తీనాకు సంఘీభావంగా ధరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేరళ వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు అబు జాజర్. ఈ సందర్భంగా పాలస్తీనాలో జరుగుతున్న ఘర్షణను తగ్గించేందుకు భారత్ ముఖ్య భూమిక పోషించాలని ఆయన అన్నారు.
గాజాపై ఇజ్రాయెల్ చర్యలపై ప్రియాంక గాంధీ ముందునుంచి విమర్శిస్తూ వస్తున్నారు. గత అక్టోబర్ లో ఈ విషయంలపై స్పందిస్తూ గాజాపై మిలిటరీ ఆపరేషన్స్ వలన అంతర్జాతీయ ఒప్పందాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని అన్నారు. అదే విధంగా పాలస్తీనాలో శాంతి స్థాపనకు మోడీ ప్రభుత్వం కృషి చేయడం లేదని విమర్శించారు. అదే విధంగా గాజాపై యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుపై కూడా ఆమె ఘాటు విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ చర్యలు చాలా క్రూరమైనవిగా, ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. 
ముందునుంచి పాలస్తీనాకు మద్ధతు ఇస్తూ వస్తున్న ప్రియాంక గాంధీ.. తాజాగా సోమవారం పాలస్తీనా బ్యాగ్ తో పార్లమెంటులో కనిపించడం అందరినీ ఆకర్శించింది. అదేసమయంలో బీజేపీ నుంచి విమర్శలకు కూడా దారి తీసింది.