కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో దిగిన ఆమె..అక్కడి నుంచి సరూర్ నగర్ బయలుదేరారు. ముందుకు ఎల్బీ నగర్ చౌరస్తాకు చేరుకోనున్న ప్రియాంకగాంధీ..అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి సరూర్ నగర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సరూర్ నగర్ యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.
కాసేపట్లో ఎల్బీనగర్ శ్రీకాంతాచారీ విగ్రహం నుంచి కాంగ్రెస్ ర్యాలీ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఎల్బీనగర్ కు ప్రియాంక గాంధీ చేరుకున్నాక... శ్రీకాంతాచారీ, అబేండ్కర్, మహత్మజ్యోతిబా పూలే, జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ర్యాలీగా సరూర్ నగర్ స్టేడియంకు చేరుకోనున్నారు