Wayanad : వయనాడ్లో ప్రియాంక నామినేషన్

Wayanad : వయనాడ్లో ప్రియాంక నామినేషన్

కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేశారు.  కలెక్టరేట్ కార్యాలయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ప్రియాంక నామినేషన్ వేశారు.  వయనాడ్ ఎంపీ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో జరుగుతున్న బైపోల్ కు ప్రియాంక మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో  పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  నవంబర్ 13న ఓటింగ్ ఓటింగ్ జరగనుంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మొదటి సారి నాకోసం ప్రచారం చేస్తున్నా: ప్రియాంక

 మొదటి సారి తన కోసం తాను ఎన్నికల ప్రచారం చేస్తున్నానని ప్రియాంక అన్నారు. నామినేషన్ వేసే ముందు బహిరంగ సభలో మాట్లాడిన  ఆమె.. 35 ఏళ్ల నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నా.. నాకు 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు  నేను 1989లో మా నాన్న కోసం మొదటిసారి ప్రచారం చేశాను. ఇప్పుడు 35 సంవత్సరాలు, నేను మా అమ్మ, నా సోదరుడు, ఇతరుల  కోసం వేర్వేరు ఎన్నికలలో ప్రచారం చేశాను. అయితే నేను స్వయంగా ప్రచారం చేసుకోవడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రియాంక.