![మృగాల దాడుల్లో జనం బలవుతున్నా పట్టదా?](https://static.v6velugu.com/uploads/2025/02/priyanka-gandhi-seeks-more-funds-to-address-human-animal-conflict-in-wayanad_Bn4W98F6r7.jpg)
- కేంద్రం, కేరళ సర్కార్‌పై
- కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్
వయనాడ్: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ ఏరియాలో క్రూర మృగాల దాడులకు అమాయకులు బలవుతున్నా.. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్, కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడటంతోపాటు, జంతువుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వయనాడ్‌లోని తిరువంబారీలో ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్డీయే సర్కార్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఇలా జరగడం దేశంలో ఇదే తొలిసారి అని, ఇలాంటి చర్యలను అడ్డుకుని తీరుతామన్నారు.