వయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం

వయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం

వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నాలుగోరోజైన గురువారం ప్రారంభమయ్యాయి. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో సభకు వచ్చిన ఆమె.. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వహించిన మూడో వ్యక్తిగా నిలిచారు. 

రాజ్యసభలో సోనియా, రాయ్ బరేలి లోక్ సభ నుంచి రాహుల్, వయనాడ్ నుంచి ప్రియాంక ఉన్నారు. లోక్‌సభ స్పీకర్‌ కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీతో కేరళలోని వయనాడ్‌ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు. వయనాడ్ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. నవంబర్ 13న వయనాడ్ లోక్ సభ నియోజవర్గంలో పోలింగ్ జరగ్గా.. 23న ఫలితాలు వెల్లడించారు.

Also Read:-అదానీని అరెస్ట్​ చేయాల్సిందే.. కాపాడేందుకుకేంద్రం ప్రయత్నిస్తోంది