వయనాడ్ ప్రచారానికి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు

వయనాడ్ ప్రచారానికి ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం ( నవంబర్ 3, 2024 ) వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల ప్రచారాన్ని పునః ప్రారంభించనున్నారు, వాయనాడ్ నియోజికవర్గ వ్యాప్తంగా బహిరంగ, కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్నారు ప్రియాంక. ఈ ప్రచారంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ( నవంబర్ 3, 2024 ) ఉదయం 11 గంటలకు మనంతవాడిలోని గాంధీ పార్క్ లో జరిగే ఉమ్మడి బహిరంగ సభలో ప్రియాంక, రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఆ తర్వాత ప్రియాంక మరో మూడు ప్రాంతాల్లో విడివిడిగా కార్నర్ మీటింగ్లు నిర్వహించనున్నారని సమాచారం.

ప్రియాంక షెడ్యూల్ ఇదే: 

  • నవంబర్ 3 మధ్యాహ్నం 1 గం - మనంతవాడిలోని వాలాడ్లో కార్నర్ మీటింగ్,
  • మధ్యాహ్నం 2.30 - కోరోంలో కార్నర్ మీటింగ్ 
  • సాయంత్రం 4.45 - కల్పేటలోని తరియోడ్లో కార్నర్ మీటింగ్ 
  • నవంబర్ 4 ఉదయం 10 గంటలకు సుల్తాన్ బతేరిలోని కెనిచ్చిరలో కార్నర్ మీటింగ్ 
  • 11 గంటలకు - పుల్పల్లిలో కార్నర్ మీటింగ్ 
  • 11.50 గంటలకు - ముల్లెంకొల్లిలోని పదిచ్చిరలో కార్నర్ మీటింగ్ 
  • మధ్యాహ్నం 2 గంటలకు కల్పేటలోని ముత్తిల్లో కార్నర్ మీటింగ్ 
  • 3.50 గంటలకు - వైతిరిలో కార్నర్ మీటింగ్ 
  • నవంబర్ 5, 6 మరియు 7 తేదీల షెడ్యూల్ గురించి త్వరలోనే ప్రకటిస్తారు.

వాయనాడ్ నియోజకవర్గంలో మూడు జిల్లాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మనంతవాడి (ఎస్టీ), సుల్తాన్ బతేరి (ఎస్టీ),  వయనాడ్లోని కల్పెట్ట, కోజికోడ్లోని తిరువంబాడి, మలప్పురంలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. వీటిలో, కాంగ్రెస్ వండూరు, కల్పేట, సుల్తాన్ బతేరి స్థానాలను కలిగి ఉండగా.. ఈరనాడ్ లో యూడీఎఫ్ మిత్రపక్షమైన ఐయూఎంఎల్ నేత పీకే బషీర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా, ఇటీవల సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ను వీడిన ఇండిపెండెంట్ అభ్యర్థి, నిలంబూరు ఎమ్మెల్యే పీవీ అన్వర్ ప్రియాంకకు మద్దతు ప్రకటించారు. రాహుల్ గాంధీ గత లోక్సభ ఎన్నికల్లో రాయబరేలీతో పాటు గెలిచిన స్థానాన్ని ఖాళీ చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. వాయనాడ్ లో బుధవారం ( నవంబర్ 13, 2024 ) ఓటింగ్ జరగనుంది.