పరీక్షల మాఫియాను అంతంచేయాలె .. ప్రియాంక గాంధీ ట్వీట్

న్యూఢిల్లీ: పరీక్షల మాఫియాను అంతం చేసేందుకు యూపీ సర్కారు గట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. యూపీలోని యువత, వారి కుటుంబాలకు ఈ దుస్థితి ఎవరి వల్ల దాపురించిందని ఆమె ప్రశ్నించారు. పేపర్ లీకేజీలు యువత తలరాతను మారుస్తాయా అని ఆమె అడిగారు. నిత్యం ఎంతో శ్రమకోర్చి, పంటలు, బంగారం అమ్మి, లోన్ తీసుకుని తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తు న్నారని చెప్పారు. ‘బీజేపీ ప్రభుత్వానికి యువత భవిష్యత్తుపై సీరియన్ నెస్ ఉంటే పరీక్షల మాఫియాను అంతమొదించడానికి గట్టి, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుంది’ అని  ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.