Priyanka Gandhi: వన్ నేషన్..వన్ ఎలక్షన్ బిల్ హౌజ్ ప్యానెల్లో ప్రియాంకాగాంధీ

Priyanka Gandhi: వన్ నేషన్..వన్ ఎలక్షన్ బిల్ హౌజ్ ప్యానెల్లో ప్రియాంకాగాంధీ

పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజ్యాంగ సవరణ బిల్లును మరింత అధ్యయనం చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జేపీసీ)కి కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు సభ్యులను ఎంపిక చేశారు. వీరిలో వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కూడా ఉన్నారు. ఆమెతోపాటు ఎంపీ మనీష్ తివారీ(ఇంకా పరిశీనలో ఉంది), కాంగ్రెస్ నుంచి రణదీప్ సూర్జేవాలా, సుఖ్ దేశ్ భగత్ సింగ్ లను కూడా కమిటీలో చేర్చింది. 

మంగళవారం (డిసెంబర్ 17) కేంద్ర కేబినెట్ ఆమోదించిన రెండు బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024 ఉన్నాయి. ప్రతిపక్షాల వ్యతిరేకతల మధ్య ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖమంత్రి అర్జున్ మేఘవాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. వీటిపై పార్లమెంట్ లో చర్చలు జరగనున్నాయి. 

ALSO READ | జమ్మూ కాశ్మీర్‎లో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి.. నలుగురికి సీరియస్

రాజ్యాంగం (129వ సవరణ) బిల్లు 2024 రాజ్యాంగంలోని మూడు ఆర్టికల్‌లను సవరించి , కొత్త ఆర్టికల్ 82Aని చేర్చాలని ప్రతిపాదించింది. అయితే ఈ బిల్లు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి అధిక అధికారాలను ఇస్తుందని విపక్షాలు ఆందోళనలలో లేవనెత్తాయి. దీంతో జేపీసీకి పంపారు. 

గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..తన అజెండా పెట్టుకంది. పార్లమెంట్, లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. 

లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించడం తొలిఅడుగు.. స్థానిక సంస్థల ఎన్నికలు 100 రోజుల్లో నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిం ద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏక కాల ఎన్నికలపై నివేదిక సిఫారసు చేసింది.