వయనాడ్ ఉప ఎన్నిక: భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ

వయనాడ్ ఉప ఎన్నిక: భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ

వయనాడ్ లోక్ సభ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యంతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం 85 వేలకు పైగా మెజార్టీతో ఆమె స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. లక్షకు పైగా మెజారిటీ దిశగా ప్రియాంక గాంధీ గెలుపు లాంఛనం కానుంది. AICC జనరల్ సెక్రటరీగా ఉన్న ప్రియాంకా గాంధీ ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి.. ప్రజాక్షేత్రంలో పోటీ చేస్తున్నారు.

వయనాడ్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో..అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వన్సైడ్ మెజారిటీతో ప్రియాంక గాంధీ లీడ్లో ఉన్నారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ హవా కనిపించింది.