బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో లేడీ ఫైటర్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుకున్నారు ప్రియాంక జైన్(Proyanka jain). స్పా బ్యాచ్ లో ఒకరిగా ఉన్నప్పటికీ.. ఆమె ఆట చాలా మందికి నచ్చింది. అందుకే ఆమె టాప్ ఫైవ్ చోటు దక్కించుకున్నారు. సీజన్ ముందు నుండే తనపై ఆడియన్స్ దృష్టిపడేలా చాలా కష్టపడ్డారు ప్రియాంక. మేల్ కంటెస్టెంట్స్ కు ఏమాత్రం తగ్గకుండా.. టాస్కుల్లో టఫ్ ఫైట్ ఇచ్చారు ప్రియాంక. అందుకే ఆమె చాలా మందికి ఫెవరెట్ గా నిలిచారు.
ఇక బిగ్ బాస్ అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆట గురించి, బిగ్ బాస్ షో గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు ప్రియాంక.. హౌస్ లో నాకు నచ్చిన వాటి గురించి, తప్పు అనిపించినవాటి నాకు అనిపించింది చెప్పాను. అమర్, శోభ నాకు చాలాకాలం నుండి ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఇద్దరితో ఎక్కువ చనువుగా ఉన్నాను. అంతేకానీ.. నేను ఎవరి నుండి ఏదీ ఆశించలేదు. నా శక్తి మేరకు ఆడాను. విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయినప్పుడు మాత్రం కాస్త బాధగా అనిపించేది.
నావరకు నేను టాప్ 5 వరకూ రావడాన్ని చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. బిగ్ బాస్ డబ్బుల ఆఫర్ ఇచ్చినా నేను తీసుకోలేదు కారణం.. ఆడియన్స్ నాపై నమ్మకం పెట్టుకుని టాప్ 5 వరకూ తీసుకొచ్చారు. వారినమ్మకాని ఒమ్ము చేయదలుచుకోలేదు. అందుకే ఆ మనీ తీసుకోలేదు.. అంటూ చెప్పుకొచ్చారు ప్రియాంక.