అతడెవరో క్లారిటీ ఇచ్చేసింది

అతడెవరో క్లారిటీ ఇచ్చేసింది

టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేశ్‌ అయ్యర్‌ లు లవ్ లో ఉన్నారంటూ గత కొద్దిరోజలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేసుకోవడంతో ఈ వార్తలకు బీజం పడింది. అయితే ఇటీవల ఓ వ్యక్తితో దిగిన ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసిన ప్రియాంక.. ఆ ఫోటోకు 'అతడే' అంటూ ఓ క్యాప్షన్‌ పెట్టింది. కానీ అతడెవరో మొహం కనిపించకుండా జాగ్రత్త పడింది. దీంతో అతను వెంకటేశ్‌ అయ్యర్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఆ ఫోటో కాస్త వైరల్ కావడంతో రూమర్స్ పైన ప్రియాంక రెస్పాండ్ అయింది. " ఫోటోలోని అబ్బాయి ఫోటో సెషన్ పనుల్లో మాకు సహాయం చేయటానికి వచ్చాడు. బాయ్ ఫ్రెండ్ అంటూ వార్తలు రావటంపై అమ్మ అడుగుతోంది. ఇక దీని గురించి మాట్లాడటం మానేస్తే బావుంటుంది" అంటూ రూమర్స్ కి చెక్ పెట్టింది. కాగా తెలుగులో టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా ఏంట్రీ ఇచ్చిన ప్రియాంక.. ఆ తరువాత సత్యదేవ్, కిరణ్ అబ్బవరం తదితర యంగ్ హీరోల సరసన నటించి హిట్స్ కొట్టింది.