దేశంలో నిరుద్యోగ సమస్యపై కేంద్రం మౌనం చాలా ప్రమాదకరమన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కొత్త ఉద్యోగాలు రాకపోగా… ఉన్న ఉద్యోగాలు పోతున్న దుస్థితి ఏర్పడిందన్నారు. ఆటోమొబైల్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని వచ్చిన మీడియా కథనాలపై ఆమె స్పందించారు. ఉద్యోగాలు పోతున్న దుస్థితిపై బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉండటం చాలా ప్రమాదకరమని తెలిపారు ప్రియాంక.