
చండీఘర్ వేదికగా మంగళవారం (ఏప్రిల్ 8) చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య ఒక్కసారిగా సంచలనంగా మారాడు. 39 బంతుల్లో సెంచరీ కొట్టి ప్రతి ఐపీఎల్ 2025 లో తొలి సెంచరీ నమోదు చేశాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీతో దుమ్ము రేపాడు. ఈ 24 ఏళ్ళ బ్యాటర్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు ఏకంగా 9 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఎండ్ లో సహచరులు విఫలమవుతున్నా ఒక్కడే వారియర్ లో పోరాడాడు.
ప్రియాంష్ ఆర్య ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో అలవోకగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదేశాడు. దీంతో భారత క్రికెట్ లో యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతులకు ఆరు సిక్సర్ల కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 39 బంతుల్లోనే సెంచరీ చేసుకున్న ప్రియాంష్.. 50 బంతుల్లో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. దిగ్గజ క్రికెటర్లు.. స్టార్ క్రికెటర్లకు సైతం ఈ రికార్డ్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కానీ ఇంకా క్రికెట్ ఓనమాలు నేర్చుకుంటున్న ప్రియాంష్ ఆర్య అలవోకగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదేశాడు.
Also Read : సెంచరీతో ప్రియాంష్ ఆర్య విధ్వంసం
ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నా ఇప్పటివరకు స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. చివరి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే నేడు చెన్నైపై జరిగిన మ్యాచ్ లో స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట అలవోకగా బౌండరీలు బాదేశాడు. అతని ఆట తీరు చూస్తుంటే త్వరలో స్టార్ ప్లేయర్ గా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రియాంష్ ఆర్య చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
ONE MAN SHOW 💥
— ESPNcricinfo (@ESPNcricinfo) April 8, 2025
Priyansh Arya stuns CSK with the fourth-fastest century in IPL history!#PBKSvCSK LIVE 👉 https://t.co/VDYI54POe9 pic.twitter.com/Ci197evCOX