పుణె: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ చివరి అంచె పోటీలతో పాటు ప్లేఆఫ్స్‌కు పుణె ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెల 26 నుంచి 29 వరకు పుణెలోని బాలెవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని బ్యాడ్మింటన్ హాల్లో ప్లేఆఫ్స్, ఫైనల్ జరుగుతాయని లీగ్ ఆర్గనైజర్ మషాల్ స్పోర్ట్స్ బుధవారం ప్రకటించింది.
లీగ్ దశలో టాప్2లో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. 3–6 స్థానాల్లో జట్లు డిసెంబర్ 26న జరిగే ఎలిమినేటర్ 1,2 మ్యాచ్‌ల్లో పోటీపడతాయి. డిసెంబర్ 27న సెమీఫైనల్స్, 29న ఫైనల్ షెడ్యూల్ చేశారు.