పుణెలో నేటి నుంచి పీకేఎల్ చివరి దశ

పుణెలో నేటి నుంచి పీకేఎల్ చివరి దశ

పుణె:  ప్రొ కబడ్డీ లీగ్‌‌ 11వ ఎడిషన్‌‌  చివరి అంచెకు చేరుకుంది. హైదరాబాద్, నోయిడా దశలు విజయవంతంగా పూర్తవగా మంగళవారం నుంచి పుణెలో మూడో, చివరి దశ లీగ్ మ్యాచ్‌‌లు జరుగుతాయి. తొలి  పోరులో  బెంగళూరు బుల్స్– గుజరాత్ జెయింట్స్-పోటీ పడనుండగా, తర్వాతి మ్యాచ్‌‌లో రెండు మరాఠా జట్లయిన- యు ముంబా,  పుణెరి పల్టాన్‌‌ --తలపడనున్నాయి. 

ఈ నెల 24 వరకు లీగ్ దశ మ్యాచ్‌‌లు కొనసాగుతాయి. అనంతరం ఇదే వేదికపై 26,27వ తేదీల్లో  ఎలిమినేటర్స్‌‌,సెమీ ఫైనల్స్, 29న మెగా ఫైనల్‌‌ జరుగుతాయి.