హైదరాబాద్, వెలుగు: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌కు ప్లేయర్లు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం కొత్త సీజన్ మొదలవనుంది. ఇందుకోసం అన్ని జట్లు ఇప్పటికే సిటీకి చేరుకొని ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి.
ఈ క్రమంలో పరిమాచ్ స్పోర్ట్స్ సంస్థ మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కబడ్డీ స్టార్స్ పర్దీప్ నర్వాల్, అషు మాలిక్, గుమన్ సింగ్ పలువురు అభిమానులను కలుసుకున్నారు. ఫ్యాన్స్‌తో మాట్లాడి వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆటోగ్రాఫ్స్ ఇచ్చి, ఫొటోలు దిగి వారిని ఖుషీ చేశారు.