హైదరాబాద్, వెలుగు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ సాధించింది. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఆరో మ్యాచ్‌లో టైటాన్స్ 35–34తో తమిళ్ తలైవాస్‌పై నెగ్గింది. దీంతో మూడు విజయాలు, మూడు పరాజయాలతో మొత్తం 21 పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో నిలిచింది.
టైటాన్స్ టీమ్‌లో పవన్ సెహ్రావత్ (12), ఆశీష్ నర్వాల్ (9), విజయ్ మాలిక్ (4), సాగర్ (3) రాణించారు. తమిళ్ రైడర్ సచిన్ 17 పాయింట్లు రాబట్టినా లాభం లేకపోయింది. నితీశ్ కుమార్ (4), నరేందర్ (3) ఓ మాదిరిగా ఆడారు. మరో మ్యాచ్‌లో యు ముంబా 42–40తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. ముంబా స్టార్ రైడర్ అజిత్ చవాన్ 19 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.