నీట్ ఫలితాలపై విచారణ చేయించాలి: స్టూడెంట్ యూనియన్లు

నీట్ ఫలితాలపై విచారణ చేయించాలి: స్టూడెంట్ యూనియన్లు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన నీట్ ఎగ్జామ్ ఫలితాలపై  సమగ్ర విచారణ చేయించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్​యూ విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్న సమయంలోనే, నీట్ ఫలితాలను ప్రకటించడం పేరెంట్స్ లో అనుమానాలు కలిగిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్.మూర్తి, కార్యదర్శి నాగరాజు, ఏఐఎఫ్​ఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్, పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షుడు పరుశురామ్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

ఒకే సెంటర్ లో వరుస రూల్ నెంబర్లుగా ఉన్న విద్యార్థులకు ఒకే మార్కులు పొందడం, దేశవ్యాప్తంగా 62 మంది విద్యార్థులకు 720/720 మార్కులు రావడం ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఏ వచ్చినప్పటి నుంచి పరీక్షల్లో పారదర్శకతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ, ఎన్టీఏ సంయుక్తంగా వైద్య విద్యను ప్రైవేటీకరించిన తీరు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతోందన్నారు. ఈ అంశంపై వెంటనే స్పందించి, పారదర్శకంగా విచారణ చేయించాలన్నారు. అవసరమైతే రీ ఎగ్జామ్ నిర్వహించడంతోపాటు ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.