ట్యాంక్ బండ్ లోని చిల్డ్రన్​ పార్క్ ను పట్టించుకోరా?

ట్యాంక్ బండ్ లోని చిల్డ్రన్​ పార్క్ ను పట్టించుకోరా?

సిటీలో టూరిస్టు ప్లేస్ అనగానే మొదటగా అందరికీ గుర్తొచ్చేది ట్యాంక్​బండ్. అలాంటిది నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వచ్చే.. లోయర్ ​ట్యాంక్​బండ్ ​కవాడీగూడలోని రోటరీ చిల్డ్రన్ మిని పార్క్ పడావుపడ్డది. కొంతకాలంగా ఈ పార్కును హెచ్ఎండీఏ అధికారులు గాలికొదిలేయడంతో అధ్వాన్నంగా తయారైంది.

 పేరుకుపోయిన చెత్త, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, విరిగిపోయిన వాటర్​ పాండ్స్​ ఇలా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయి.  ఆక్వేరియం ప్రదేశం చెత్తతో నిండిపోయి కంపుకొడుతుంది. ఏటా బతుకమ్మ, ఛట్​ పూజ వంటి కార్యక్రమాలు ఈ పార్కులోనే చేస్తారు. అప్పుడు తప్పితే అధికారులు ఇటువైపు కన్నెత్తిచూడరు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.   – హైదరాబాద్, వెలుగు