వాగుల్లోని చెలిమెల నీళ్లు తాగుతున్నం.. బోర్లు వేసి ఆదుకోండి సారూ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘వాగుల్లోని చెలిమెల నీళ్లు తాగుతున్నం.. ఎండలకేమో వాగులు ఎండుతున్నయి.. బోర్లు వేసి ఆదుకోండి సారూ’.. అంటూ అశ్వారావుపేట మండలం మొద్దులమడ జీపీ పరిధిలోని ఉడుముల బండ, రాళ్లవాగు, మద్యగుంపు, పెద్దమిద్ది గ్రామాలకు చెందిన గిరిజనులు కలెక్టర్​ను వేడుకున్నారు. సోమవారం గ్రీవెన్స్ లో వారు కలెక్టర్​ను కలిశారు. ఇద్దరు చిన్న పిల్లలున్నారని, ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టర్​మాట్లాడుతూ గ్రీవెన్స్​దరఖాస్తులను ఆఫీసర్లు త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్​ఉంచవద్దన్నారు. అడిషనల్​కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్ చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు.

సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్​ వేయాలి

కలెక్టరేట్ లోని అన్ని శాఖల సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్​తప్పనిసరి వేయాలని కలెక్టర్ అనుదీప్​ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ప్రతి సోమవారం బయోమెట్రిక్​అటెండెన్స్ పై సమీక్ష ఉంటుందన్నారు. బయోమెట్రిక్​హాజరు ద్వారానే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలు, జీపీల్లో రీడింగ్ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. ముర్రేడు వాగుపై నిర్మిస్తున్న రెండో వంతెన పనులను స్పీడ్​గా చేపట్టాలని నేషనల్ హైవే డీఈని ఆదేశించారు. 
మున్సిపాలిటీల్లో వైకుంఠ దామాలకు, కొత్తగూడెంలోని రామవరంలో నిర్వహించాల్సిన బయో మైనింగ్​కు విద్యుత్​ సరఫరా చేయాలని ఆశాఖ​శాఖాధికారులను ఆదేశించారు. ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్​వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.