కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్​ కార్పొరేషన్​ ఏర్పాటు ప్రక్రియ షురూ

కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్​ కార్పొరేషన్​ ఏర్పాటు ప్రక్రియ షురూ
  • కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • రూ. 450 కోట్లతో రింగ్​ రోడ్డు నిర్మాణాలకు పర్మిషన్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలను కలుపుతూ ఏర్పాటు చేసే కార్పొరేషన్​ ప్రక్రియ మొదలైందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ. 4.50 కోట్ల డీఎంఎఫ్​ నిధులతో సీసీ, బీటీ రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ట్రాఫిక్​ సమస్యకు శాశ్వత పరిష్కారంలో భాగంగా రూ. 450కోట్లతో రింగ్​ రోడ్డు నిర్మాణానికి పర్మిషన్​ వచ్చిందని తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో మున్సిపల్​ చైర్​ పర్సన్​ కే.సీతాలక్ష్మి, మున్సిపల్​ కమిషనర్​ శేషాంజన్​ స్వామి, తహసీల్దార్​ పుల్లయ్య, సీపీఐ జిల్లా సెక్రటరీ సాబీర్​ పాషా, పలు అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.