కామారెడ్డిటౌన్ , వెలుగు: కామారెడ్డి జిల్లాలో శనివారం హోం ఓటింగ్ ప్రక్రియ షురూ అయింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎలక్షన్ కమిషన్ హోం ఓటింగ్ నిర్వహిస్తోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గంలోని టౌన్తో పాటు, గ్రామాల్లో హోం ఓటింగ్ నిర్వహించారు. ఎలక్షన్ ఆఫీసర్లు, సిబ్బంది వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. కేంద్రాలకు రాలేని వారి కోసం ఎలక్షన్ కమిషన్ హోం ఓటింగ్ వేసే అవకాశం కల్పించిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ఓటు వేసేందుకు గోప్యత కోసం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం కూడా హోం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే 4,546 మందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆర్డీవో రంగానాథరావు, ఆఫీసర్లు ఉన్నారు.