పీవో, ఏపీవోల సెకండ్ ​ర్యాండమైజేషన్

కామారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్​లో పోలింగ్​ఆఫీసర్లు, అసిస్టెంట్​ పోలింగ్​ఆఫీసర్ల సెకండ్​ర్యాండమైజేషన్​ ప్రక్రియను పూర్తిచేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్​ నియోజకవర్గాలతో పాటు, బాన్సువాడలోని మూడు మండలాల్లోని 912 పోలింగ్​స్టేషన్లకు సంబంధించిన పీవోలు, ఏపీవోల సెకండ్​ ర్యాండమైజేషన్​ నిర్వహించారు. 

అబ్జర్వర్లు చిఫంగ్​అర్థుర్​ వర్చూయియో, జగదీశ్, కలెక్టర్​ జితేశ్​ ​వీ పాటిల్​ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. పీవో, ఏపీవోలకు ఈ నెల 21,22,23 తేదీల్లో ట్రైనింగ్​ఇవ్వనున్నారు. నోడల్​ఆఫీసర్లు రాజారాం, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.