బోధన్లో ఘనంగా దుర్గామాత శోభయాత్ర

బోధన్,వెలుగు:  పట్టణంలోని దుర్గామాత శోభయాత్ర ఘనంగా కొనసాగింది. మంగళవారం ఏకచక్రేశ్వరశివాలయం వద్ద  ఉన్నా దుర్గామాతకు బోధన్ గ్రామ కమిటి ఆధ్వర్యంలో ఉత్సవ  కమిటీ చైర్మెన్ పూజారిలింగం, పట్టణ ప్రముఖులు ప్రత్యేక  పూజలు  చేశారు.   కార్యక్రమంలో వీడీసీ  చైర్మెన్  బాగరెడ్డి, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రవీంద్రయాదవ్,  ఫ్లోర్ లీడర్ బెంజరి గంగారాం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డి మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, పాల్గొన్నారు.

ఆర్మూర్​లో

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ లో దసరా పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సహాలతో జరుపుకున్నారు. జంబి హన్మాన్ మందిర ఆవరణలో జంబి చెట్టుకు పూజలు చేసి భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. సర్వ సమాజ్​ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో జెండా బాలాజీ మందిరం నుంచి వెంకన్న ఉత్సవ మూర్తులన రథం పై శోభాయాత్రగా జంబి హన్మాన్ మందిరం వరకు తీసుకువచ్చారు.   మహిళలు మంగళ హారతులతో  పూజలు చేసి కొబ్బరి కాయలు కొట్టారు.  రావణ సంహారం కార్యక్రమం నిర్వహించారు.