- కొన్నది సగమే..టార్గెట్ 4 లక్షల టన్నులు
- 2.09 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
- ఇందులో సన్నాలు 4,511 టన్నులే
- ఫాస్ట్‌గా వడ్ల పైసలు
- రూ.485 కోట్లు చెల్లింపు
- రూ.16 లక్షలే డ్యూ
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో 2024 వానాకాలం సీజన్వడ్ల కొనుగోళ్లు ముగిశాయి. కొనుగోలు టార్గెట్‌లో సగానికి మాత్రమే సివిల్సప్లయ్కొనుగోలు చేసింది. మిగిలిన సగం బహిరంగ మార్కెట్‌కు తరలిపోయాయి. వానాకాలం 2024 సీజన్లో జిల్లావ్యాప్తంగా 2.90 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో సన్న రకం కేవలం 35 వేల ఎకరాల్లో సాగు చేయగా, మిగిలిన మొత్తం దొడ్డు రకాలే సాగు చేశారు. మొత్తంగా 6.25 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన ఆఫీసర్లు కొనుగోలు సెంటర్లకు 4 లక్షల టన్నులు వస్తాయని భావించారు. ఈ అంచనాతోనే ఈసారి గతంలో ఎన్నడూలేని విధంగా 372 సెంటర్లు ఏర్పాటు చేశారు.
2.09 లక్షల టన్నులు కొనుగోలు..
అయితే సివిల్సప్లయ్డిపార్ట్మెంట్తో పోటీగా ట్రేడర్లు, మిల్లర్లు దళారులను రంగంలోకి దింపి వడ్ల కొనుగోళ్లు నిర్వహించారు. దీంతో టార్గెట్‌కు సగం దూరంలోనే నిలిచి, కొనుగోళ్లు ముగిసే నాటికి 24,072 మంది రైతుల నుంచి 2,09,325 టన్నులను కొనుగోలు చేశారు. ఈ సీజన్లో సన్న రకం వడ్లు 70 వేల టన్నుల దిగుబడి వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. రూ.500 బోనస్ఇస్తున్నందున కనీసం 30 వేల టన్నులు సెంటర్లకు వస్తాయని భావించారు. అయితే కేవలం 4,511 టన్నులు మాత్రమే సెంటర్లకు రావడంతో కొనుగోలు చేశారు.
వడ్ల పైసలు ఫాస్ట్.. బ్యాలెన్స్‌రూ.16.41 లక్షలే..
వడ్ల పైసలు గతంలో ఎన్నడూలేని విధంగా ఫాస్ట్‌గా చెల్లించారు. గతంలో వడ్లు కొనుగోలు చేసిన తర్వాత నెల తర్వాతే వడ్ల పైసలు రైతుల ఖాతాల్లో జమ అయ్యేవి. వడ్ల కొనుగోళ్లు ముగిసినా కనీసం రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు పెండింగ్‌లో ఉండేది. ఈసారి మాత్రం వారంలోపే రైతులకు అందాయి.
ALSO READ : అల్లు అర్జున్‍కు ఓ న్యాయం..సీఎం తమ్మునికో న్యాయమా ?
మొత్తం 2,09,325 టన్నులను కొనుగోలు చేయగా, రూ.485,63,41,856 రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోళ్లు ముగిసే నాటికి రూ.485.47 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 71 వేల టన్నులకు చెందిన రూ.16,41,856 రైతులకు చెల్లించాల్సి ఉంది. గడిచిన పదేండ్లలో ఏనాడూ ఇంత పాస్ట్‌గా డబ్బులు చెల్లించిన ఉదంతాలు లేవు.
సన్నాలకు రూ.2.25 కోట్ల బోనస్..
ఈ సీజన్లో కొనుగోలు చేసిన సన్న రకం వడ్లకు ప్రభుత్వం బోనస్ చెల్లించింది. మొత్తంగా 45,110 క్వింటాళ్లను కొనుగోలు చేసింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున రూ.2,25,55,000 రైతుల ఖాతాల్లో సివిల్సప్లయ్జమ చేసింది.