- ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్‌రెడ్డి
ఆర్మూర్, వెలుగు: కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని, గ్రామాల అభివృద్ధి చెందాలంటే తమ పార్టీకే పట్టం కట్టాలని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి కోరారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. జీవన్ రెడ్డికి రెండుసార్లు గెలిపిస్తే ఆర్టీసీ జాగా ఆక్రమించి షాపింగ్ మాల్ నిర్మించారని, ఆర్మూర్, అంకాపూర్, హైదరాబాద్ లో కోట్ల రూపాయలతో హైటెక్ బంగ్లాలు కట్టుకున్నారని, ప్రజలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా కట్టివ్వలేదన్నారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఆర్మూర్ అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. జీవన్ రెడ్డి ఓటమి భయంతో కుక్కర్లు, చీరలు పంచుతూ ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పెర్కిట్ లో ఆసిఫ్ ఆయన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీ అధికార ప్రతినిధి మార చంద్రమోహన్, టౌన్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు సాయిబాబా గౌడ్, విట్టం జీవన్, లీడర్లు కోల వెంకటేశ్, వెంకట్రామ్ రెడ్డి, పుట్టింటి శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్‌గౌడ్, ముక్కెర విజయ్, కొంతం మురళి పాల్గొన్నారు.