కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను తయారు చేసిన : జానారెడ్డి

కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం,తెలంగాణ తెచ్చిందన్నారు ఆ పార్టీ  సీనియర్ నేత కుందూరు జానారెడ్డి.  తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ ను అడుగడుగున తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను వందలాది మంది బలమైన నాయకులను తయారు చేశానన్నారు.  కానీ మీడియాకు సమయం కేటాయించలేకపోయానని చెప్పారు.  ఇకపై బీజేపీ, బిఆరెస్ వైపల్యాలను కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరిస్తానని తెలిపారు. నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి పాల్గొన్నారు. 

 నల్గొండ పార్లమెంట్ పరిధిలో మెజార్టీ కోసం కాంగ్రెస్ నాయకులకే పోటీ ఉందన్నారు  ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థి రఘువీర్ రెడ్డి. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ తరుపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారం మరువలేనిదని చెప్పారు.  అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను పక్కకు జరిపినట్టే  పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని కూడా దించాల్సిన అవసరం ఉందన్నారు.