మెగా ట్రోలింగ్: మరోసారి తెరపైకి మెగా వర్సెస్ అల్లు వివాదం.. అల్లు అరవింద్ జస్ట్ 'నో కామెంట్స్'

మెగా ట్రోలింగ్: మరోసారి తెరపైకి మెగా వర్సెస్ అల్లు వివాదం.. అల్లు అరవింద్ జస్ట్ 'నో కామెంట్స్'

"మెగా వర్సెస్ అల్లు.." ఈ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిన అది వైరల్ అవుతుంది. చిన్నపాటి ఫంక్షన్స్ ఐన, సినిమాలు రిలీజైన, ఏదైన ఇన్సిడెంట్స్ జరిగి, ఏ ఒక్కరు స్పందించకున్న అది కొన్ని నెలల పాటు సంచనలనం అవుతుంది.

ఈ ఏడాది వ్యవధిలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీస్ సరిగ్గా ఒకరికొకరు ఉండడటం లేదని తరుచూ వినిపిస్తూనే ఉంది. ఇక తామందరి మధ్య ఉన్నది మంచి వాతావరణం అని చిరంజీవి, అల్లు అరవింద్ ఎన్నోసార్లు క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ, అంతలోనే ఏపీ ఎన్నికలు రావడం, అల్లు అర్జున్ తన ఫ్రెండ్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేయడం మరోసారి వీరి మధ్య గ్యాప్ ఉందనే భావాన్ని తీసుకొచ్చింది.

Also Read : ఫైన‌ల్లీ నీ ముఖం ద‌ర్శ‌నం అవుతుంది సామీ

ఆ తర్వాత పుష్ప 2 రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, చిరు అల్లు వారి ఇంటికి వెళ్లడం, పరామర్శించడం జరిగింది. దాంతో వీరి మధ్య సఖ్యత ఉందని అనుకునే లోపే, చరణ్ అల్లు వారి ఇంటికి వెళ్లలేదని అల్లు ఫ్యాన్స్లో చర్చకు వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఏదో వైరం ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అసలేం జరిగింది? సోషల్ మీడియాలో అల్లు అరవింద్పై మెగా ఫ్యాన్స్ ఎందుకు కోపంగా ఉన్నారో చూద్దాం. 

ఇటీవలే అల్లు అరవింద్ తండేల్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా రామ్ చరణ్ డెబ్యూ మూవీపై మాట్లాడారు. తన అల్లుడు చరణ్ డెబ్యూ మూవీ చిరుత సరిగ్గా ఆడలేదని, బిలో యావరేజ్గా ఆడిందని అన్నారు. అందుకే రెండో సినిమాతో ఎలాగైనా హిట్ ఇవ్వాలని మగధీర తీశానని తెలిపారు.

అంతే కాకుండా.. నష్టపోతానని అనుకున్నానని, కానీ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిందని అల్లు అరవింద్ చెప్పారు. దీంతో ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. 2007లో రిలీజైన చిరుత మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కానీ, అల్లు అరవింద్ అలా అనడంతో మెగా ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేపోయారు. ఇక అల్లు అరవింద్ని టార్గెట్ చేస్తూ చిరుత సాధించిన కలెక్షన్స్ గురించి చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

నిజానికి ‘చిరుత’ మూవీ రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. ఆ టైంలో డెబ్యూ హీరోలకు ఇంత బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. ఫుల్ రన్లో ఈ మూవీ ఏకంగా రూ.25.19 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్గా బయ్యర్స్కు ఈ మూవీ రూ.7.19 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్గా నిలిచింది.

ఇక లేటెస్ట్గా అల్లు అరవింద్ని తండేల్ ప్రెస్ మీట్లో మీడియా అడగ్గా..నో కామెంట్స్ అంటూ రిప్లయ్ ఇచ్చారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ నా దృష్టికి వచ్చిందని.. అంత గమనిస్తున్నాని.. నో కామెంట్స్ అంటూ అల్లు అరవింద్ ప్రశ్నను దాటవేశారు. దాంతో మరోసారి మెగా వర్సెస్ అల్లు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.