దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత.. ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలింపు

దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత.. ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులను ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐటీ అధికారుల వాహనంలోనే దిల్ రాజు తల్లిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను ఏ ఆసుపత్రిలో జాయిన్ చేశారు..? అనారోగ్యానికి గురి కావడానికి గల కారణం ఏంటి..? ప్రస్తుతం దిల్ రాజు తల్లి ఆరోగ్యం ఎలా ఉందన్న పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ | IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!

గత మూడు రోజులుగా నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. మంగళవారం (జనవరి 20) మొదలైన ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. దిల్ రాజు ఇళ్లు, ఆఫీస్‎తో పాటు ఆయన కుమార్తె, సోదరుడి ఇళ్లలోనూ ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. దిల్ రాజు బ్యాంక్ ఖాతాలు, ఐటీ రిటర్న్, బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలించారు. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ సినిమాల బడ్జెట్ లెక్కలపైన అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇంట్లో సోదాలు జరుగుతుండగానే దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురి కావడం గమనార్హం.