సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు లేవు. .ఆ హీరో ప్రొసీడ్ అనడంతో ముందుకొచ్చాం: నిర్మాత

సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు లేవు. .ఆ హీరో ప్రొసీడ్ అనడంతో ముందుకొచ్చాం: నిర్మాత

మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో ‘డ్రింకర్ సాయి’ చిత్రాన్ని రూపొందించామని నిర్మాత బసవరాజు లహరిధర్ అన్నారు.  ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత బసవరాజు లహరిధర్ మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీలో మాకెలాంటి పరిచయాలు లేవు. మా నాన్నగారు పీఆర్‌‌‌‌‌‌‌‌పీ పార్టీలో కీలకంగా ఉండేవారు. అప్పట్నుంచీ చిరంజీవి గారితో అసోసియేషన్ ఉంది. ఈ కథ గురించి ఆయన తెలుసుకుని ఓకే ప్రొసీడ్ అన్నారు. అలా ఈ చిత్రాన్ని  స్టార్ట్ చేశాం. డైరెక్టర్ కిరణ్ ఎంతో డెడికేటెడ్‌‌‌‌గా రూపొందించారు. డ్రింకర్ సాయిగా  ధర్మ,  బాగీ  పాత్రలో  ఐశ్వర్య ఆకట్టుకునేలా నటించారు. ఫస్టాఫ్‌‌‌‌లోనే యూత్‌‌‌‌ఫుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండాఫ్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఇంప్రెస్ అయ్యేలా  ఉంటుంది.

ఆడియెన్స్‌‌‌‌ను థియేటర్స్‌‌‌‌కు వచ్చేలా అట్రాక్ట్ చేసేందుకే ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌లో కొంత యూత్‌‌‌‌ఫుల్ ఎలిమెంట్స్ రివీల్ చేశాం. ఈ లవ్ స్టోరీలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మ్యూజిక్ హైలైట్‌‌‌‌గా నిలుస్తుంది. ఇక  నైజాంలో ఈ చిత్రాన్ని  ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఆశించిన  థియేటర్స్ దక్కాయి’ అని చెప్పారు.