సమంత కి ఆరోగ్య సమస్య.. ప్రొడ్యూసర్ రూ.25 లక్షలు సహాయం.. ఇన్నేళ్లకి బయటపడింది.

సమంత కి ఆరోగ్య సమస్య.. ప్రొడ్యూసర్ రూ.25 లక్షలు సహాయం.. ఇన్నేళ్లకి బయటపడింది.

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒకప్పుడు వరుస సినిమాలని నిర్మించి ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తన ఇద్దరికొడుకులైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు తదితరులని హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇందులో సాయి శ్రీనివాస్ అడపాదడపా సినిమాలతో రాణిస్తుండగా గణేష్ బాబు మాత్రం కెరీర్ లో చతికిల పడుతున్నాడు. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత గురించి గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో తన కుటుంబానికి మంచి సన్నహిత సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. ఈ క్రమంలో ఇప్పటికీ సమంత ని తమ ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా భావిస్తామని చెప్పుకొచ్చాడు. ఇందుకు కారణాలు లేకపోలేదని సమంతకి సహాయం చేస్తే కచ్చితంగా గుర్తుపెట్టుకుని విధేయతగా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే సమంత "అల్లుడు శ్రీను" సినిమాలో నటించే సమయంలో స్కిన్ సమస్యలతో ఇబ్బంది పడేదని, దీంతో ట్రీట్మెంట్ కోసం డబ్బు అవసరం కాగా దాదాపుగా రూ.25 లక్షలు రొటేషన్ చేశానని దీంతో సమంత ట్రీట్మెంట్ పూర్తయిందని తెలిపాడు.

Also Read:-అల్లు అర్జున్ టీంపై క్రిమినల్ కేసు నమోదు.. 

అయితే ఈ స్కిన్ ట్రేట్మెంట్ సమయంలో సమంత కొంతమందికి ఫోన్ చేసి డబ్బులు అడిగిందని కానీ వారు లేవని చెప్పడంతో తాను డబ్బు సర్దుబాటు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన జరిగి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ సమంత చేసిన మేలు గుర్తుపెట్టుకుని తనపట్ల ఎంతో విధేయతతో ఉంటుందని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సమంత భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ అన్ని భాషలలో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. కాగా ఇటీవలే సమంత నటించిన సిటాడెల్ అనే వెబ్ సీరీస్ రిలీజ్ అయ్యింది. ఈ వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రసారమవుతోంది.