![రాజకీయ పార్టీ తరహాలో స్పోక్స్ పర్సన్ ని నియమించుకోబోతున్న అల్లు అర్జున్.. పెద్ద ప్లాన్ వేస్తున్నాడా..?](https://static.v6velugu.com/uploads/2025/02/producer-bunny-vas-is-confirmed-allu-arjun-is-going-to-recruit-a_WhNigTr0qV.jpg)
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ పార్టీ తరహాలో స్పోక్స్ పర్సన్ ని నియమించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ నిర్మాత బన్నీవాసు కన్ఫర్మ్ చేశాడు. ఇటీవలే బన్నీవాసు తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ సందర్భంలో మాట్లాడుతూ ఇక నుంచి అల్లు అర్జున్ కి సంబందించిన ఎటువంటి విషయాలనైనా అఫీషియల్ గా తెలియజేసేందుకు స్పోక్స్ పర్సన్ ని నియమించబోతున్నామని, ఇందుకోసం సరైన పర్సన్ కోసం చూస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా రాజకీయ పార్టీలు, నాయకులు స్పోక్స్ పర్సన్స్ ని నియమించుకుంటుంటారు. ఈ క్రమంలో తమకి సంబంధించిన విషయాలు, ప్రకటనలు అన్నీ కూడా ఈ స్పోక్స్ పర్సన్స్ ద్వారా ప్రజలకి చేరవేస్తుంటారు. హీరోలు మాత్రం తమకి సంబందించిన ఏ విషయమైనా మీడియా ముందుకు వచ్చి తెలియజేసేవారు. లేదంటే పీఆర్ ల ద్వారా తమకి సంబందించిన విషయాలని ప్రజలకి తెలియజేసేవారు.
Also Read : రిలీజ్‌కు ముందే అజిత్ మూవీ రికార్డులు
కానీ రాజకీయ పార్టీ తరహాలో స్పోక్స్ పర్సన్ ని నియమించుకోబుతున్నాడంటే బన్నీ ఎదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడని కొందరు అంటున్నారు. అన్నీ కుదిరితే రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల సమాచారం. ఏదేమైనప్పటికీ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలతో బన్నీ కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రిలీజ్ కి ముందే రూ.1060 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప 2 థియేటర్స్ లో కూడా నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చెయ్యగా రూ.2000 కోట్లకి పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇటీవలే పుష్ప 2 ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాగా టాప్ 1 లో ట్రెండ్ అవుతోంది.