అసలు ‘తండేల్‌‌’ అంటే ఏంటో.. ఒరిజినల్ స్టోరీ ఏంటో చెప్పేసిన బన్నీ వాసు

అసలు ‘తండేల్‌‌’ అంటే ఏంటో.. ఒరిజినల్ స్టోరీ ఏంటో చెప్పేసిన బన్నీ వాసు

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీ వాసు ఇలా ముచ్చటించారు. ‘‘నా  ఫ్రెండ్ భాను ద్వారా రైటర్ కార్తిక్ ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చాడు. అందులోని ఎసెన్స్‌‌ నచ్చి దర్శకుడు చందూకి చెప్పాను.  తనకు కూడా నచ్చడంతో చాలా రీసెర్చ్ చేశాం.

రాజు, సత్యల ప్రేమకథ ద్వారా ఒరిజినల్‌‌గా జరిగిన స్టోరీని చూపించాం. ఇందులో యాభై శాతం ఫిక్షన్, మరో యాభై శాతం నాన్ ఫిక్షన్‌‌. పలువురి జీవితాల్లో జరిగిన ఇన్సిడెంట్స్‌‌ను ‘తండేల్‌‌’ రాజు పాత్రకు ఆపాదించి చూపించాం. చేపల వేటకు వెళ్లే వాళ్లలో మెయిన్‌‌ లీడర్‌‌‌‌ను ‘తండేల్‌‌’ అంటారు. ఇదొక గుజరాతీ పదం. ఫిషర్ మ్యాన్ పాత్ర కోసం నాగచైతన్య మౌల్డ్ అయిన విధానం అద్భుతం.

థియేటర్స్‌‌లో చైతుని చూసి సర్‌‌‌‌ప్రైజ్ అవుతారు.  చైతు తనకు గట్టి కాంపిటేషన్ ఇస్తున్నాడంటూ మ్యాచ్ అయ్యేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది సాయిపల్లవి.  శివుని పాటలో వీళ్లిద్దరి డ్యాన్స్ థియేటర్స్‌‌లో పూనకం తెప్పిస్తుంది. ఇలాంటి రూటెడ్‌‌ స్టోరీకి తగ్గట్టుగా ఎంతో నేచురల్‌‌గా దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చారు.

కేరళ, మంగళూరు, గోవా, వైజాగ్ ఇలా నెంబర్ ఆఫ్ లోకేషన్స్ లో షూట్ చేశాం. తుఫాన్ ఎపిసోడ్స్ మినహా మిగతా సీన్స్ అన్నీ సముద్రంలోనే చిత్రీకరించాం.  శ్యామ్ దత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా కుదిరింది.  ట్రైలర్‌‌‌‌లో చూసిన దానికంటే తెలియని కథ ఎంతో ఉంది.  పాకిస్తాన్ జైల్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. సినిమాలో చాలా ఇంటరెస్టింగ్ కంటెంట్ ఉంది’’.