విజయ్ సేతుపతి హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన చిత్రం ‘విడుదల 2’. చింతపల్లి రామారావు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 20న సినిమా రిలీజ్ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ‘అహంకారంతో పాలకులు అణచివేసిన సామాన్యుల నుంచి పుట్టుకొచ్చిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2’.
యదార్థ సంఘటనల ఆధారంగా తమిళంలో తీసినప్పటికీ తెలుగు నేటివిటీ ఉన్న కథ. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడి సంఘటనలు ఉన్న సినిమా కనుక మన నేటివిటీకి సరిగ్గా సరిపోతుంది. నక్సలైట్ పెరుమాళ్ పాత్రలో సేతుపతి నటన అద్భుతం. ఇళయరాజా గారి నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం. ఇందులోని సంగీతంతో ఆయన ప్రళయరాజాలా అనిపిస్తారు.
అలాగే మంజు వారియర్ సహజ నటన, పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఆకట్టుకుంటాయి. ‘విడుదల 1’ తరహాలో ఇది కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకముంది. ఇక మేం నిర్మించిన ‘శ్రీశ్రీ రాజావారు’ రిలీజ్‌కు రెడీగా ఉంది. త్వరలో ‘డ్రీమ్ గర్ల్’ అనే సినిమా ప్రారంభించబోతున్నాం’ అని చెప్పారు.
విజయ్ సేతుపతి పోషించిన 'పెరుమాళ్ వాతియార్' పాత్ర యొక్క శక్తివంతమైన కథను కొనసాగిస్తూ.. అతని ప్రయాణం, అతని రాజకీయ తిరుగుబాటు మరియు సిస్టమ్‌తో అతనికున్న సంక్లిష్ట సంబంధాన్ని లోతుగా చూపించబోతున్నారు. కుల మత రాజకీయాలను అడ్డుపెట్టుకుని కొందరి వ్యక్తుల మోసం.. అందుకు తిరగబడిన ఓ సామాన్యుడు.. పూర్తిస్థాయి మావోయిస్ట్‌గా ఎలా మారడనేది కథాంశంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది.