Game Changer: గేమ్ ఛేంజర్కు దెబ్బ మీద దెబ్బ.. లోకల్ టీవీ ఛానల్లో ప్రసారం.. టాలీవుడ్ నిర్మాత ఆగ్రహం

గేమ్ ఛేంజర్ సినిమాకు అదృష్టం బాలేదట్టుంది. సినిమా రిలీజైన ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ రావడం, రెండో రోజుకే ఆన్లైన్లో హై క్వాలిటీతో లీకవడం జరిగింది. దాంతో సినిమాపై ఆడియన్స్లో ఉన్న బజ్ మొత్తం పోయింది. ఇక డిజాస్టర్ టాక్తో పాటు దారుణమైన కలెక్షన్స్ రావడం మొత్తానికే మొత్తం గేమ్ ఛేంజర్కి నష్టాలూ తెచ్చిపెట్టాయి.

ఇదిలా ఉంటే.. ఇవేమి చాలవు అన్నట్టు లోకల్ ఛానల్లో 'గేమ్ ఛేంజర్' ప్రసారం అవ్వడం మేకర్స్కి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఏపీ లోకల్ టీవీ అనే ఛానెల్లో మూవీ హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ టెలికాస్ట్ అయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లేటెస్ట్గా ఈ ఇష్యూపై బేబీ సినిమా ప్రొడ్యూసర్ నిర్మాత శ్రీనివాస కుమార్ (SKN) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు X లో స్పందించారు

“ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 5 రోజుల క్రితం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకువచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాని లోకల్ ఛానళ్లలో, బస్సుల్ లో ప్రసారం చేస్తున్నారు. ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు.. ఇది 4 సంవత్సరాల కృషి. వేలాది మంది కలల ఫలితం. ఈ సినిమాల సక్సెస్ పై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల జీవితాల గురించి ఆలోచించండి. ఇలాంటి పనులు చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు కూడా ముప్పు కలిగిస్తాయి. ఈ చర్య ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సినిమాను కాపాడడానికి, భరోసానివ్వడానికి అందరం కలిసి గళమెత్తాల్సిన అవసరం ఉందని" పోస్ట్ చేశాడు. దీనికి #SaveTheCinema అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు.

జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.100 కోట్లు మాత్రమే షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. దాదాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీకి ఇలాంటి పరిణామాలు ఎదురవ్వడం చిత్ర బృందానికి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. మరి ఇలాంటి పరిణామాలపై ప్రభుత్వాలు, సినిమా పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.