టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ లో ఫేక్ కలెక్షన్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులోభాగంగా ఈ మధ్య కాలంలో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఏరియాల వారీగా కలెక్షన్స్ ని చూస్తే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని దీంతో జిల్లాకి ఒకరో ఇద్దరో డిస్ట్రిబ్యూటర్లు మిగులుతున్నారని తెలిపాడు.
దీంతో ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటింగ్ కల్చర్ పూర్తిగా మారిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఇండస్ట్రీలో సినిమాల సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్ రేషియోనే ఎక్కువగా ఉందని దీంతో 100 సినిమాలు తీస్తే అందులో 90 సినిమాలు ఫ్లాప్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు మిగులుస్తున్నాయని ఎమోషనల్ అయ్యాడు.
ఇక కొందరు ఇండస్ట్రీలోని సినిమాల గురించి కాకుండా నిర్మాతల ఆఫీసులో జరిగే విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని దీంతో ఉన్నవీ లేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారని అలాంటివి రాయకండి అంటూ సీరియస్ అయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిజల్ట్స్ గురించి మాట్లాడుతూ కష్ట సమయంలో అనిల్ రావిపూడి సినిమాతో బయటపడ్డామని దీంతో సినిమాకి బడ్జెట్ ముఖ్యం కాదు స్టోరీ ముఖ్యమని తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక భవిష్యత్ లో కంటెంట్ ఉన్న సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపాడు.
ALSO READ | Gaami: విశ్వక్‌సేన్ సినిమాకి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక
ఈ విషయం ఇలా ఉండగా గత నెల సంక్రాంతి బరిలో సీల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. దీంతో పలు చోట్ల డిస్ట్రిబ్యూటర్లకి తీరని నష్టాలు వచ్చాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ.280 కోట్లు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో నిర్మాత దిల్ రాజు దాదాపుగా సేఫ్ అయ్యారు.