టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే సినిమా ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ దర్శకుడు శంకర్ పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
అయితే బీహార్ బడ్జెట్ తో తెరకెక్కడంతో గేమ్ ఛేంజర్ సినిమాకి కూడా బెనిఫిట్ షోస్ వేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సమయంలో జరిగిన సంఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోస్, ప్రీమియర్స్ విషయంలో కొంతమేర సందిగ్దత నెలకొంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇకనుంచి స్పెషల్ షోస్ కి పర్మిషన్స్ ఇవ్వమని ప్రకటించింది.
అయితే గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్ విషయం గురించి నిర్మాత దిల్ రాజు స్పందించాడు. ఇందులోభాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్కాగా, జాగ్రత్తగా ప్లాన్ చేసి అప్డేట్ ఇస్తామని తెలిపాడు. ఇక గేమ్ ఛేంజర్ తోపాటూ సంక్రాంతి బరిలో దిగనున్న బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపాడు.