గేమ్ ఛేంజర్ స్టోరీ ఏంటో చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెల్ కానుందా..?

గేమ్ ఛేంజర్ స్టోరీ ఏంటో చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెల్ కానుందా..?

టాలీవుడ్ ప్రముఖ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్యాన్ ఇండియాతోపాటూ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా ప్రమోషన్స్ షురూ చేశారు. శనివారం అమెరికాలోని డల్లాస్ లో ప్రీ రిలేజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి భారీగా అభిమానులు వచ్చారు.

 ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమా గురించి పలు ఆసక్తికార విషయాల్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారని తెలిపాడు. గేమ్ ఛేంజర్ స్టోరీ నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవిక సంఘటనలకు దగ్గరగా ఉంటుందని కాబట్టి కచ్చితంగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక నుంచి రెగ్యులర్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటూ అన్నిచోట్ల ఈ సినిమాపై హైప్ పెంచుతామని చెప్పుకొచ్చాడు. దీంతో దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ALSO READ | సీఎం రేవంత్‎కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

గతంలో శంకర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీసిన "ఒకే ఒక్కడు" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో గేమ్ ఛేంజర్ లో కూడా ఒకే ఒక్కడు సినిమా ఛాయలు కనిపించే అవకాశం ఉంటుందని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఒకప్పుడు పాలిటిక్స్ పై సినిమా ఆడియన్స్ కి అవగాహన తక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలపట్ల అవగాహన పెరిగిందని ఇలాంటి పరిస్థితుల్లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలని తెరకెక్కించడం, హిట్ కొట్టడం సాహసమని అంటున్నారు. అలాగే శంకర్ తన రెండు చివరి చిత్రలైనఇండియన్ 2, 2.O సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయాయి.

ఇక ఇప్పటివరకూ ఈ సినిమానుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్ వంటివాటికి ఆడియన్స్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  దీంతో గేమ్ ఛేంజర్ పై ఆసక్తితోపాటూ అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటించగా, విలన్ గా ఎస్.జె సూర్య నటించాడు. శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.