ప్రేక్షకులు క్లారిటీగా ఉన్నారు.. నచ్చకుంటే బై బై చెబుతున్నారు: దిల్ రాజు

ప్రేక్షకులు క్లారిటీగా ఉన్నారు.. నచ్చకుంటే బై బై చెబుతున్నారు: దిల్ రాజు

‘‘ఓటీటీ, శాటిలైట్‌‌‌‌‌‌‌‌తో పాటు పైరసీలో సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తున్నారంటే మూడు గంటల వినోదం కోసమే. ఆ వినోదాన్ని ప్రేక్షకులకు అందించేందుకే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు దిల్ రాజు. వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం మార్చి 7న రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో దిల్‌‌‌‌‌‌‌‌ రాజు మాట్లాడుతూ ‘12 ఏళ్ల తర్వాత మళ్లీ వెంకటేష్, మహేష్ బాబు కలిసి థియేటర్స్‌‌‌‌‌‌‌‌కు వస్తున్నారు. 

రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ ప్రకటించగానే పది థియేటర్స్‌‌‌‌‌‌‌‌ ఫుల్ అయ్యాయి. ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్యామిలీ ఆడియన్స్ టికెట్స్ అడుగుతున్నారు. మంచి చిత్రాలు తీస్తే జనం థియేటర్స్‌‌‌‌‌‌‌‌కు వస్తారని రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌లు ప్రూవ్ చేస్తున్నాయి.  12 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌లో కూడా హౌస్‌‌‌‌‌‌‌‌ఫుల్స్‌‌‌‌‌‌‌‌ అవడం చూసినప్పుడు వచ్చే కిక్ వేరు. దాంతో పోలిస్తే వసూళ్లు ఎంత వస్తాయనేది ముఖ్యం కాదు. ఇక జనం థియేటర్స్‌‌‌‌‌‌‌‌కు రావడం లేదని భయపడాల్సిన అవసరం లేదు. 

ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెన్సేషనల్ హిట్ అయింది. ఓటీటీలోనూ రికార్డ్ స్థాయిలో వాచ్ టైం వస్తోంది. ఎంత పెద్ద సినిమా వచ్చినా నచ్చకపోతే మార్నింగ్ షోకే బైబై చెబుతున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ సరేసరి. ప్రేక్షకులు చాలా క్లారిటీగా ఉన్నారు. టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసి ఆ సినిమా చూడాలా వద్దా అని ఫిక్స్ అవుతున్నారు. మంచి సినిమానే చూస్తున్నారు’ అని చెప్పారు.