ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత నిర్మించిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవలే నిజామాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ తెలంగాణలోని తెల్ల కల్లు, మటన్ ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో కొందరు నాయకులు దిల్ రాజు తెలంగాణ కల్చర్ ని అవమానించే విధంగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
ఇందులో భాగంగా తాను తెలంగాణ వాసిగా తన సంప్రదాయాలు, ఆచారాలపట్ల ఎంతో గౌరవం ఉందని తెలిపాడు. అయితే తాను తెల్ల కల్లు, మటన్ గురించి తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదని, సినిమాల బిజీలోపడి దావత్ లో తెల్ల కల్లు, మటన్ ని మిస్ అవుతున్నానని దాంతో ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మంచిగా దావత్ చేసుకోవాలని చెప్పుకొచ్చాడు. కానీ ఈ మాటలని కొందరు తప్పుగా అర్థం చేసుకుని తాను తెలంగాణ కలర్చర్ ని అవమానించినట్లుగా ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అలాగే తన మాటలవల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి క్షమాపణలు తెలిపాడు.
Also Read :- డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ
గౌరవప్రదమైన ఎఫ్డీసి చైర్మన్ పదవిలో ఉండి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు అలాగే ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి వారధిగా పని చేస్తానని కాబట్టి రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకుని సహకరించాలని కోరాడు. తాను గతంలో నిజామాబాద్ లోని భన్సావాడ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఫిదా, బలగం సినిమాలకి నేషనల్ వైడ్ గా గుర్తింపు లభించిందని దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభినందించాయని అలాంటిది తెలంగాణ కల్చర్ ని అవమానించే విధంగా ఎలా మాట్లాడుతానని అన్నారు. మొత్తానికి దిల్ రాజు తెల్ల కల్లు, మటన్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వడంతో ఈ కాంట్రవర్సీకి పులిస్టాప్ పడింది.
ఈ విషయం ఇలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. ఫ్యామిలీ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.