ఐటీ దాడులపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఐటీ దాడులు అనేవి వెరీ కామన్ అని చెప్పారు. తన ఇళ్లు,ఆఫీసుల్లో అకౌంట్స్ చెక్ చేసిన అధికారులు తన స్టేట్ మెంట్ తీసుకున్నారని తెలిపారు. రైడ్స్ సమయంలో ఫ్యామీలీ మెంబర్స్ అందరి దగ్గర రూ. 20లక్షల్లోపే డబ్బుందని చెప్పారు. తనిఖీల తర్వాత తమ అకౌంట్స్ అన్నీ క్లియర్ గా ఉండటం చూసి.. ఐటీ అధికారులే షాకయ్యారని తెలిపారు. తనిఖీల్లో డబ్బులు కానీ.. ఆస్తుల పత్రాలు ఏమీ దొరకలేదనన్నారు.
ఐదేళ్ల నుంచి ఎక్కడా పెట్టుబుడులు పెట్టలేదన్నారు దిల్ రాజు. సినీ నిర్మాణంలో ఉన్నప్పుడు అన్నీ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తారని చెప్పారు. తమ ఆర్థిక లావాదేవీలన్నీ క్లీన్ గా..క్లియర్ గా ఉన్నాయని తెలిపారు. 2008లో తనపై ఐటీ రైడ్స్ జరిగాయని.. మళ్లీ ఇపుడు జరిగాయని చెప్పారు. కొంత మంది ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మా అమ్మ ఆరోగ్యం బాగుంది..ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు దిల్ రాజు.
నాలుగు రోజులు సోదాలు
తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్, ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారుల సోదాలు జనవరి 24న శుక్రవారం మధ్యాహ్నంతో ముగిశాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఢాకు మహారాజ్ సహా భారీ బడ్జెట్ సినిమాల ఆదాయం, ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ALSO READ | కుంభమేళాలో అద్భుతం: సన్యాసం తీసుకున్న అందమైన మాజీ హీరోయిన్