ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ సొంతూరులో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. తన కుటుంబంతో కలిసి నిజామాబాద్ జిల్లా నర్సింగపల్లి గ్రామానికి వెళ్లిన దిల్ రాజు ఘనంగా భోగి, సంక్రాంతి వేడుకులు చేసుకున్నారు.
భోగి పండుగ వేడుకల్లో ఆడి పాడారు. నర్సింగపల్లిలోని ఇందూరు తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో కలిసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ దిల్ రాజు కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు.