గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా అని, కేవలం పాటల కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేశామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. తనకు కం బ్యాక్ సినిమా గేమ్ చేంజర్ అని, చిరంజీవి అప్రిసియేట్ చేశారని అన్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా బాగా వచ్చిందని అన్నారు. ఎఫ్2 ను ఎలా ఎంజాయ్ చేశారో అలాగే ఎంజాయ్ చేస్తారని చెప్పారు.
సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మళ్లీ ఓ సారి కలుస్తామని టీఎఫ్డీసీ చైర్మన్, గేమ్ చేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారేమో చూస్తామని అన్నారు. ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిందని, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రికి ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు.
ALSO READ | PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
టికెట్ రేటు పెంచడం వల్ల 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుందని చెప్పారు. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలని అన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారని చెప్పారు. తెలంగాణా సీఎం గారు సినీ ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను అన్నారని, ఆ ఆశతో మళ్లీ సీఎం ని కలుస్తానని దిల్ రాజు చెప్పారు. ఏపీలో ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళ్తూ యాక్సిడెంట్ లో చనిపోయిన ఇద్దరి కుటుంబాలకు అండగా ఉంటామని దిల్ రాజు చెప్పారు.
ఐదేసి లక్షల సాయం (దిల్ రాజు వార్త ఇన్సెట్)
రాజమండ్రిలో నిన్న గేమ్ చేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన కుటుంబాకు రూ. ఐదేసి లక్షల చొప్పున ఆర్థియ సాయం అందిస్తామని సినిమా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. నిన్న జరిగిన ఈవెంట్ కు కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్ హాజరయ్యారు. ఇండ్లకు తిరిగి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీళ్లిద్దరి కుటుంబాలకు రూ. ఐదేసి లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. వీళ్ల కుటుంబాలకు అందగా ఉంటామని దిల్ రాజు భరోసా ఇచ్చారు.